ఖానాపూర్, వెలుగు: ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఆయా పార్టీలకు చెందిన 200 మంది మహిళలు, కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన పలువురు జాన్సన్ నాయక్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాన్సన్ మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మౌలిక సదుపాయాలతో పాటు రోడ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందాయన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన కోరారు.
జాన్సన్ గెలవాలని హనుమాన్ ఆలయంలో పూజలు
జాన్సన్ నాయక్ భారీ మెజార్టీతో గెలవాలని కోరుతూ ఖానాపూర్ మున్సిపల్ 1వ వార్డు కౌన్సిలర్ కావలి సంతోష్ ఆధ్వర్యంలో వార్డు పరిధిలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపారు. పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు రాజేందర్, ఖలీల్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు రాజ గంగన్న, పరిమి సురేశ్, కౌన్సిలర్లు కుర్మ శ్రీనివాస్, జన్నారపు శంకర్, నాయకులు రాము నాయక్, శనిగారపు లింగన్న, ప్రదీప్, రాజేశ్వర్, కిషోర్, రాజు, మెహరాజ్ తదితరులు ఉన్నారు.