బీఆర్ఎస్ పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది : జాన్సన్ నాయక్

  • ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్

ఖానాపూర్, వెలుగు : సీఎం కేసీఅర్ ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని ఆ పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి  భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. సోమవారం ఖానాపూర్ పట్టణంతో పాటు ఉట్నూరు మండలం వంకాతుమ్మ గ్రామం అయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ  సందర్భంగా  మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారన్నారు.  కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. వంకాతుమ్మ గ్రామంలో ఆదివాసులు జరుపుకుంటున్న దండారి ఉత్సవాల్లో అయన పాల్గొన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, మాజీ జడ్పీటీసీ రాము నాయక్, ఆర్ బీఎస్ జిల్లా డైరెక్టర్ కొక్కుల ప్రదీప్, నాయకులు  తిరుపతి, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.

జాన్సన్ నాయక్ ఇంట్లో లక్ష్మీదేవి యాగం

దీపావళి పండుగను పురస్కరించుకొని జాన్సన్ నాయక్ దంపతులు తమ నివాసంలో ఆదివారం రాత్రి లక్ష్మీదేవి యాగం నిర్వహించారు. ఖానాపూర్ నియోజకవర్గం ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ యాగం చేసినట్లు జాన్సన్ నాయక్  తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సక్కరం శ్రీనివాస్, ఏఎంసీ  మాజీ వైస్ చైర్మన్ శనిగారపు శ్రవణ్, నాయకులు ప్రసాద్, సంతోష్  తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయం : ఆవుల రాజిరెడ్డి