ఖానాపూర్​ఎమ్మెల్యేకు టైఫాయిడ్ జ్వరం.. ఉట్నూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స

  • టైఫాయిడ్ ఫీవర్తో ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిక


నిర్మల్: ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అస్వస్థతకు గురయ్యారు. టైఫాయిడ్ ఫీవర్​తో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్​అయ్యారు. జ్వరం అధికంగా ఉండటంతో 4, 5 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

సర్కార్​దవాఖానాలపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ప్రజాప్రతినిధులు ఇలా చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కేటీఆర్ మిత్రుడైన జాన్సన్ నాయక్‌ భూక్యాపై బొజ్జు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.