
ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరారు. ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా రేఖానాయక్ ను కాదని ఖానాపూర్ బీఆర్ఎస్ టికెట్ ను భూక్యా జాన్సన్ నాయక్ కు కేటాయించింది అధిష్టానం. ఈ క్రమంలో ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ఆమెకు టికెట్ ఇస్తుందో లేదో చూడాలి. కాగా రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు.