రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్, బీజేపీకి లేదు : ఎమ్మెల్యే రేఖా నాయక్

ఖానాపూర్, వెలుగు : రైతుల సంక్షేమం గురించి కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు సదస్సుకు ఎమ్మెల్యే చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత బీఅర్ఎస్ సర్కార్​కే దక్కుతుందన్నారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతులను మోసంచేసే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

ALSO READ :ఐదు రోజుల జైలు శిక్ష

ఈ రెండు పార్టీల నాయకుల మాటలను రైతులు నమ్మొద్దన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా స్థానిక నేతలు, రైతులతో  కలిసి రేఖా నాయక్ మొక్కలు  నాటారు. సర్పంచులు శ్రీనివాస్, మహేందర్, వైస్ ఎంపీపీ వాల్ సింగ్,  పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్,శంకర్,  వైస్ చైర్మన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.