
- బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమే ధ్యేయంగా పనిచేస్త
- ప్రియాంక ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరుత
- ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్
జన్నారం, వెలుగు : బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ ను ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తానని ఖానాపూర్ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా ఆధ్వర్యంలో ఈనెల 18న ఆ పార్టీలో చేరతానని ఆమె వెల్లడించారు. శనివారం మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
బీఆర్ఎస్ లో అగ్ర కులాలకు పెద్దపీట వేస్తూ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనకు టిక్కెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేని ఎన్ఆర్ఐని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారని ఫైరయ్యారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తానన్నారు. ఈ సమావేశంలో జన్నారం సర్పంచ్ బుసనవేని గంగాధర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీశ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.