నిధులు ఆపారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ కంటతడి

నిధులు ఆపారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ కంటతడి

జన్నారం, వెలుగు : ‘నాకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలే. ఇప్పుడు అభివృద్ధి పనులకూ ఫండ్స్​ ఆపిన్రు. ఒక మహిళా ప్రజాప్రతినిధిపై ఇన్ని కుట్రలా?’ అంటూ ఖానాపూర్​ఎమ్మెల్యే రేఖా నాయక్​ కంటతడిపెట్టారు. శుక్రవారం జన్నారం గ్రామ పంచాయతీలోని చింతగూడలో ఆమె పర్యటించి మాట్లాడారు. తనకు టికెట్ ఇవ్వకుండా పార్టీ పెద్దలు కుట్ర చేశారని, తీరా ఇప్పుడు ఖానాపూర్ ​నియోజకవర్గానికి  ఫండ్స్​ కూడా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టారు.

ALSO READ: కవితపై విచారణ పది రోజులు వాయిదా..సుప్రీంకోర్టుకు తెలిపిన ఈడీ    

రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పోటీలో ఉంటానని  స్పష్టం చేశారు. అంతకుముందు జన్నారం పంచాయతీలోని గోండుగూడ శ్మశానవాటిక వరకు రూ.3 కోట్ల ఐటీడీఏ నిధులతో మంజూరైన బీటీ రోడ్డుకు సంబంధించి ప్రొసీడింగ్ కాపీని సర్పంచ్ కు అందజేశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీశ్, డైరెక్టర్ కాంతామణి, జన్నారం సర్పంచ్ గంగాధర్ గౌడ్ ఉన్నారు.