కవితకు జాన్సన్ నాయక్ థ్యాంక్స్

ఖానాపూర్, వెలుగు : బీఆర్​ఎస్ ​తరఫున ఖానాపూర్​ఎమ్మెల్యే టికెట్​దక్కించుకున్న జాన్సన్​నాయక్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితను కలిశారు. మంగళవారం హైదరాబాద్ లోని ఆమె నివాసంలో మర్యా దపూర్వకంగా కలిసి తనకు అవకాశం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని విధాలా కృషి చేస్తానని ఆమెతో చెప్పారు.

ఎమ్మెల్యేలతో అనిల్ జాదవ్ 

నేరడిగొండ : బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు స్థానంలో బోథ్​ నియోజకవర్గ టికెట్ ​సాధించిన నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ ఎమ్మెల్యే లు రాథోడ్ బాపూరావు, జోగు రామన్నను వారి నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని శాలువాలతో సత్కరించి మద్దతు ఇవ్వాలనికోరారు.