అన్ని వర్గాల ప్రజలకు అండగా ప్రభుత్వం

అన్ని వర్గాల ప్రజలకు అండగా ప్రభుత్వం

ఖానాపూర్/కడెం, వెలుగు: అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడపడుచుల పెండ్లి అయ్యే ఖర్చులో ప్రభుత్వం రూ.లక్ష అందిస్తోందన్నారు.

 త్వరలో తులం బంగారం కూడా అందిస్తామని తెలిపారు. అంతకుముందు పట్టణంలోని మార్కెట్ యార్డుతో పాటు మండలం లోని సత్తనపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను అయన ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్యం, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, రమేశ్, కౌన్సిలర్లు సురేశ్, శంకర్, అమానుల్లా ఖాన్, మాజీ వైస్ ఎంపీపీ తోట సత్యం, అధికారులు పాల్గొన్నారు.

కడెంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

కడెం మండలం కొండకూరు, లక్ష్మీపూర్, పాండ్వాపూర్ గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బొజ్జు ప్రారంభించారు. రైతులు దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ శైలజ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీశ్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.