జన్నారం, వెలుగు: నిరుపేద కుటుంబానికి చెందిన ఆదివాసీ బిడ్డనైన తనను గెలిపించిన ఖానాపూర్ నియోజక వర్గం ప్రజల రుణం తీర్చుకుంటానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి జన్నారం వచ్చిన సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీమ్ ల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుపేదలకు రూ.10 లక్షల ఆరోగ్య శ్రీ సేవలను అమలు చేశామని త్వరలోనే మిగిలిన స్కీమ్‌లను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తారని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని ప్రజలకు ఎల్లవేళాల అందుబాటులో ఉంటానని హమీ నిచ్చారు.
ర్యాలీ పాల్గొన్న ఆయన మండల కేంద్రంలోని అంబేద్కర్,తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, మాజీ ఎంపీపీ మచ్చ శంకరయ్య, పార్టీ లీడర్లు రాజశేఖర్, మోహన్ రెడ్డి, మాణిక్యం, కరుణాకర్, రాజన్న యాదవ్, ఇందయ్య, రమేశ్, నగేశ్, గంగన్న యాదవ్, సోహెల్ షా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.