- ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్
జన్నారం,వెలుగు: గ్రామాలభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందిl ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. సోమవారం మండలంలోని కామన్ పెల్లి, రోటిగూడ, చింతగూడ, తపాలపూర్, పొనకల్ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అనంతరం మండల కేంద్రంలో రూ.54 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు ఫారెస్ట్ క్వార్టర్స్ ను ప్రారంభించారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నేరువేరుస్తుందాన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, ఎంపీడీవో శశికళ, జన్నారం ఎఫ్ఆర్వో సుస్మారావు, డీఆర్వో తిరుపతి, కాంగ్రెస్ నాయకులు మిక్కిలినేని రాజశేఖర్, ఇసాక్, సుభాశ్ రెడ్డి, మోహన్ రెడ్డి, మచ్చ శంకరయ్య పాల్గొన్నారు.