కడెం ప్రాజెక్టు పైకి  ఎమ్మెల్యే, కలెక్టర్   

కడెం, వెలుగు : ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తున్న సమాచారం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మె ల్యే రేఖ నాయక్  కడెం ప్రాజెక్టుకు ప్రాజెక్టు వద్దకు చేరుకొని ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు.  తర్వాత కలెక్టర్ వరుణ్ రెడ్డి సైతం అక్కడికి చేరుకొని పరిస్థితులపై ఆరా తీశారు.

యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించి దిగువకు నీటిని విడుదల చేయాలంటూ కలెక్టర్ ఆదేశించారు. గేట్ల మొరాయింపుపై కలెక్టర్ స్పందించారు. కొద్దిరోజుల్లోనే మరో గేట్ కౌంటర్ వెయిట్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.