ఖానాపూర్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీల్లో చదువుకునే పిల్లలకు మెనూ ప్రకారం భోజనం, పోషకాహారం పెట్టాలని ఖానాపూర్ మున్సి పల్ చైర్మన్ రాజురా సత్యం ఆదేశించారు. ఖానాపూర్ పట్టణం ఇంద్రన గర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడీ కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసే ప్రతి వస్తువులను పిల్లలు, గర్భిణులకు పంపిణీ చేయాలన్నారు. కౌన్సిలర్లు పరిమి సురేశ్, షబ్బీర్ పాషా, ఉపాధ్యా యులు, అంగన్ వాడీ టీచర్లు ఉన్నారు.