ఆలూరులో భక్తిశ్రద్ధలతో ఖండేరాయ మల్లన్న జాతర

ఆర్మూర్, వెలుగు: ఆర్మూరు మండలం ఆలూర్ లో ఆదివారం ఖండేరాయ మల్లన్న జాతర భక్తిశ్రద్ధలతో జరిగింది. గ్రామంలోని ఖండేరాయుడి ఆలయం వద్ద ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో రథోత్సవం నిర్వహించారు. గ్రామంలో తొలి జాతర సందర్భంగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, ఉపవాసాలు ఉన్నారు. గ్రామ కమిటీ పెద్దలు, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.