ఆదిలాబాద్‌‌‌‌లో ఘనంగా ఖాందేవ్‌‌‌‌ జాతర

  • రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగిన తొడసం ఆడపడుచు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా నార్నూర్‌‌‌‌ మండల కేంద్రంలో జరుగుతున్న జరుగుతున్న ఖాందేవ్‌‌‌‌ జాతరను ఆదివాసీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా తొడసం ఆడపడుచు నాగుబాయి మంగళవారం రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. 

ఇలా నూనె తాగడం వల్ల సంతానం కలగడంతో పాటు మంచి జరుగుతుందని వారి నమ్మకం. 15 రోజుల పాటు జరిగే జాతరకు జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం జాతరకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మహారాష్ట్ర కోలాపూర్‌‌‌‌ ఎమ్మెల్యే తొడసం రాజుభాయ్‌‌‌‌ హాజరై పూజలు నిర్వహించారు.