Success: ఖంజర్ 12వ ఎడిషన్ విన్యాసాలు

Success: ఖంజర్ 12వ ఎడిషన్ విన్యాసాలు

ఇండియా, కిర్గిజ్​స్తాన్​ జాయింట్​ స్పెషల్​ ఫోర్సెస్ ఎక్సర్ సైజ్​ ఖంజర్​ 12వ ఎడిషన్​ 2025, మార్చి 10 నుంచి 23 వరకు కిర్గిజ్​స్తాన్​లో జరగనున్నది. 20 మంది సిబ్బందితో కూడిన ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్​ నుంచి పారాచూట్​ రెజిమెంట్​ స్పెషల్​ ఫోర్సెస్, 20 మంది సిబ్బందితో కూడిన కిర్గిజ్​స్తాన్​నుంచి స్కార్పియన్​ బ్రిగేడ్ స్పెషల్​ ఫోర్సెస్​ ఈ విన్యాసాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

ఇండియా, కిర్గిజ్​స్తాన్ జాయింట్​ స్పెషల్​ ఫోర్సెస్​ ఎక్సర్ సైజ్ ఖంజర్​ విన్యాసాలను ప్రతి ఏటా ఇరు దేశాలు ప్రత్యామ్నాయంగా (ఒక ఏడాది భారత్, మరో ఏడాది కిర్గిజ్​స్తాన్) 2011 నుంచి నిర్వహిస్తున్నాయి. 12వ ఎడిషన్ విన్యాసాలు 2024లో హిమాచల్​ప్రదేశ్​లోని బక్లో ప్రాంతంలో స్పెషల్​ ట్రైనింగ్ ​స్కూల్​లో జరిగాయి. 

విన్యాసాల లక్ష్యం

ప్రత్యేక దళాల శిక్షణ, కొండ ప్రాంతాల్లో సైనిక చర్యలకు కావాల్సిన నైపుణ్యత, అధునాతన సాంకేతికత, రక్షణరంగ నైపుణ్యత తదితర ద్వైపాక్షిక సహకారాలను ఈ విన్యాసం ద్వారా బలోపేతం చేస్తారు. 

ఈ విన్యాసాలు ఇరుపక్షాల మధ్య రక్షణ సంబంధాలను పటిష్టపరచుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. 

ఖంజర్ అంటే ఒక బాకు లాంటి ఆయుధం.