మహారాష్ట్ర ఎన్నికల్లో.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 5 గ్యారెంటీలు

మహారాష్ట్ర ఎన్నికల్లో.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 5 గ్యారెంటీలు

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శివసేనా, ఎన్సీపీతో కలిసి MVA కూటమిగా పోటీ చేస్తున్నాయి. మహా వికాస్ కూటమి 5గ్యారెంటీలతో ఆదివారం మేనిఫెస్టో రిలీస్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈరోజు (నవంబర్ 10న) మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి (MVA) ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శివసేన (యుబిటి) ఎంపి సంజయ్ రౌత్, ఎన్‌సిపి-ఎస్‌సిపి ఎంపి సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మరియు ఎంవిఎ కూటమి నాయకులు పాల్గొన్నారు.

వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు మరియు ఉపాధి, పట్టణాభివృద్ధి, పర్యావరణం అలాగే ప్రజా సంక్షేమం అనే అంశాలు మీద కాంగ్రెస్ పార్టీ 5గ్యారెంటీలను తయారు చేసిందని మల్లికార్జున్ ఖర్గే పార్టీ మేనిఫెస్టో వివరించారు. ఇవి మహారాష్ట్ర పురోగతి మరియు అభివృద్ధికి ఐదు స్తంభాలు లాంటివని ఆయన స్పష్టం చేశారు.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మహిళలపై నేరాలు మరియు రైతుల బాధలు చూసి మహారాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు. మహారాష్ట్ర అభివృద్ధికి కూటమి దృష్టి వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఉపాధి, పట్టణాభివృద్ధి, పర్యావరణం మరియు ప్రజా సంక్షేమంపై పెడతామని ఖర్గే తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి మరియు శ్రేయస్సు కోసం MVA కూటమి ఐదు గ్యారెంటీలను హామి ఇస్తోందని చెప్పారు. ఈ ఐదు గ్యారెంటీలతో ప్రతి కుటుంబానికి ఏడాదికి సుమారు రూ.3.5 లక్షల లబ్ధి చేకురుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. 

Also Read : ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం మీ నాలుగో తరం నుంచి కూడా కాదు

మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పట్టాలు తప్పిందని బీజేపీని టార్గెట్ చేస్తూ ఎఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. MVA మహారాష్ట్ర గర్వం, గౌరవాన్ని  తిరిగి తీసుకొస్తోందని ఆదివారం ముంబైలో జరిగిన మ్యానిఫెస్టో రిలీస్ కార్యక్రమంలో ఖర్గే అన్నారు. రాజ్యాంగంలోని రెడ్ బుక్ ను అర్బన్ నక్సలిజంతో ముడిపెట్టినందుకు ప్రధాని మోదీపై ఆయన విరుచుకుపడ్డారు. 2017లో అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు ప్రధాని ఇదే కాపీని ఇచ్చారని.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆ పుస్తకంలో ఖాళీ పేజీలు ఉన్నాయని కూడా చెప్పారని ఖర్గే గుర్తుచేశారు.