హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ వాయిదా పడింది. అనివార్య పరిస్థితుల్లో సభను వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తేదీతో పాటు సభా వేదికనూ మార్చింది. తొలుత జహీరాబాద్లో ఈ నెల 18న ఖర్గే సభ ఉంటుందని రెండు రోజుల క్రితం ప్రకటించగా.. ఇప్పుడు ఆ సభను చేవెళ్లకు మార్చి, డేట్ను 24కు సెట్చేశారు.
సోమవారం చేవెళ్ల నియోజ కవర్గానికి చెందిన పార్టీ సభ్యులతో కాంగ్రెస్ స్టేట్ ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్రేవంత్ సమావేశ మయ్యారు. చేవెళ్ల సభపై వారితో చర్చిం చారు. సభను విజయవంతం చేయాలని సూచించారు. ఖర్గే సభలోనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
ఇటీవల బీజేపీకి రాజీ నామా చేసిన ఏ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలి సింది. రెండు రోజుల కిందట చంద్రశేఖర్ ఇంటికి రేవంత్వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్లో చేరుతానంటూ చంద్రశేఖర్ కూడా ప్రకటించారు.