ఫలితాల ట్రెండ్స్​ గమనిస్తోన్న సోనియా, రాహుల్​, ఖర్గే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్​ పార్టీ తన ఆధిక్యతను చూపుతోంది. మొదటి రౌండ్​ లెక్కింపు పూర్తయ్యే సరికి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో లీడ్​లో ఉన్నారు. ఫలితాల తీరును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పర్యవేక్షిస్తున్నారు. 

ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో సోనియాగాంధీ, రాహుల్​గాంధీలు ఫలితాల ట్రెండ్స్​ను పరిశీలిస్తున్నారు. కర్ణాటక నేతల నుంచి ఎప్పటికప్పుడు అప్​డేట్స్​ తీసుకుంటున్నారు.  మరోవైపు ప్రియాంకగాంధీ సిమ్లాలోని ఆంజనేయ స్వామి టెంపుల్​లో పూజలు చేశారు.