అమ్మాయి పిలిచిందని వెళ్లిన 16 మంది.. అడ్డంగా బుక్కయిపోయారు

  • ఒకరి తర్వాత మరొకరుగా.. మొత్తం 16 మందిని మోసం చేసిన ఖిలాడీ లేడీ

ముంబై: సోషల్ మీడియాలో అందమైన అమ్మాయి ఫోటోతో ఎవరైనా పలుకరిస్తే.. వెంటనే ఐసైపోయామంటే అడ్డంగా బుక్కయినట్లే. ఇప్పటికే ఇలాంటి మోసాలు అనేకం జరిగినా.. మన కళ్ల ముందే జరుగుతున్నా.. ఇంకా మోసపోతూనే ఉన్నారు ఎంతో మంది. సోషల్ మీడియా వేదికగా ఎన్నిరకాలుగా మోసాలు జరుగుతున్నాయన్నది తెలిసినా.. అనేక మంది ఇప్పటికీ అమ్మాయి ఫోటో కనిపిస్తే చాలు సొల్లు కార్చేసుకోవడం మానడం లేదు. తాజాగా ముంబైలో ఓ ఖిలాడీ లేడి చేతిలో ఏకంగా 16 మంది యువకులు మోసపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బీసీఏ డిగ్రీ చదువుతున్న ఓ యువతి ఆర్ధిక కారణాలతో చదువుకు గుడ్ బై చెప్పి ఓ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలో చేరింది. కొంత కాలానికే లాకౌ డౌన్ రావడంతో .. చేస్తున్న ఉద్యోగం కోల్పోయిన బాధితురాలు ఏం చేయాలో తెలియక మోసాలకు ప్లాన్ చేసింది. టిండర్, బుంబుల్ తదితరు డేటింగ్ యాప్ లలో తన ప్రొఫైల్ ను అప్ లోడ్ చేసింది. ఈ యాప్ ద్వారా పరిచయమైన యువకులను కొన్ని రోజుల్లోనే సన్నిహితులుగా చేసేసుకుంటుంది. మాయ మాటలతో నేరుగా కలుసుకుందామంటూ రెచ్చగొట్టేది. ఏదైనా ఒక హోటల్ కు వెళ్దామంటూ రెచ్చగొట్టి.. వారు వెళ్లగానే కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి.. వారి వద్ద ఉన్న విలువైన వస్తువులు దోచుకునేది. ఎవరైనా ఎదురు తిరిగితే నీ అశ్లీల ఫోటోలు. వీడియోలు బయటపెడతానంటూ బెదిరించేది. దీంతో మోసపోయిన యువకులు తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా తప్పుకోవాల్సి వచ్చేది. దీంతో ఖిలాడీ లేడీ రెచ్చిపోయింది. పరిచయం చేసుకునేందుకు ఉత్సాహం చూపిన వారందర్నీ బుక్ చేసి అడ్డంగా దోచేసుకోవడమే హాబీగా పెట్టుకున్న యువతికి 16వ యువకుడు అశిష్ రూపంలో బ్రేక్ పడింది. పుణేకు చెందిన ఆశిష్ కుమార్ అనే యువకుడు పరిచయం కావడంతో అతని కోసం అదే ఊరికెళ్లి హోటల్ గది బుక్ చేసుకుని రప్పించుకుంది. అలవాటు ప్రకారం ఆశిష్ కు కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి అతను పడిపోగానే అతని ఒంటిపై ఉన్న బంగారు గొళుసు, ఉంగరం, పర్సులోని నగదు తీసుకుని ఉడాయించింది. మోసపోయిన అశిష్ బాధితురాలిని ప్రశ్నిస్తే.. రొటీన్ స్టైల్ ప్రకారం బెదిరించింది. అయితే ఇవేవీ పట్టించుకోకుండా బాధితుడు వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆధారాల మేరకు ఖిలాడీ లేడి ఇంటికెళ్లి సోదాలు జరిపారు. యువకుల దగ్గర కొట్టేసిన 15 లక్షల 25 వేల విలువైన బంగారు ఆభరణాలు, కొంత డబ్బు దొరికింది. వాటిని సీజ్ చేసి ఖిలాడీ లేడిని అరెస్టు చేశారు.

ఇవి కూడా చూడండి..

ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు

ఖతర్నాక్ డ్రోన్.. గాల్లోకి లేచిందంటే మూడ్నేళ్లు ఆకాశంలోనే

కారులో వచ్చి ఏటీఎం చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్