మహిళల ఖోఖో ప్రపంచకప్ 2025 లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ లో నేపాల్ పై భారత మహిళల జట్టు విజయం సాధించింది. 78-40 తేడాతో నేపాల్ పై ఘన విజయం సాధిచింది. తొలిసారి జరిగిన ప్రపంచకప్ లో 23 దేశాలు పాల్గొన్నాయి. భారత్ జగజ్జేతగా నిలిచింది
జనవరి 19 ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన షోడౌన్ క్లాష్‌లో నేపాల్‌ను ఓడించి భారత మహిళల జట్టు మొట్టమొదటి ఖో ఖో ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఫైనల్‌లో ప్రియాంక ఇంగ్లే నేతృత్వంలోని భారత జట్టు 78-40 తేడాతో నేపాల్ జట్టును చిత్తు చేసింది. ఛేజింగ్.. డిఫెన్స్ రెండింటిలోనూ భారత్ ఆధిపత్యం చెలాయించింది.