న్యూఢిల్లీ: తొలి ఎడిషన్ ఖో ఖో వరల్డ్ కప్‌లో ఇండియా శుభారంభం చేసింది. సోమవారం రాత్రి జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇండియా మెన్స్ టీమ్ 42–37తో నేపాల్‌పై ఐదు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తెలుగు కుర్రాడు శివా రెడ్డి బెస్ట్ ఎటాకర్‌గా నిలిచాడు. అంతముందు టోర్నీ ప్రారంభ వేడుకలు ఆకట్టుకున్నాయి. ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌ఖడ్, కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ టోర్నీని ఆరంభించారు.
2025, జనవరి 19 వ తేదీ వరకు జరిగే మెగా ఈవెంట్‌లో 23 దేశాల నుంచి 39 జట్లు పోటీ పడనున్నాయి. పురుషుల్లో 20 జట్లు, మహిళల్లో 19 జట్లు బరిలో ఉన్నాయి.