న్యూఢిల్లీ: తొలి ఎడిషన్ ఖో ఖో వరల్డ్ కప్‌లో ఆతిథ్య ఇండియా డబుల్ ధమాకా మోగించింది. మెన్స్, విమెన్స్ టీమ్స్ మెగా టోర్నీలో విజేతలుగా నిలిచాయి. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో ప్రతీక్ వైకర్ కెప్టెన్సీలోని మెన్స్ టీమ్ 54-–36 తేడాతో నేపాల్‌ను ఓడించి ట్రోఫీ గెలిచింది.
అంతకుముందు మహిళల ఫైనల్లో ఇండియా 78-–40 స్కోరుతో నేపాల్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో ఇండియా మెన్స్, విమెన్స్ టీమ్స్ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకుండా ట్రోఫీ నెగ్గడం గమనార్హం.