ఖో ఖో వరల్డ్ కప్‌‌.. క్వార్టర్స్‌‌లో ఇండియా మెన్, విమెన్స్ జట్లు

న్యూఢిల్లీ: తొలి ఎడిషన్ ఖో ఖో వరల్డ్ కప్‌‌లో ఇండియా మెన్స్‌‌, విమెన్స్‌‌ టీమ్స్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మెన్స్‌‌ టీమ్ 70–38 తేడాతో పెరుపై ఘన విజయం సాధించింది. ప్రతీక్ వైకర్‌‌‌‌ కెప్టెన్సీలోని జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాటింది. మరోవైపు మహిళల జట్టు 100–16 తేడాతో ఇరాన్‌‌ను చిత్తు చేసి నాకౌట్ రౌండ్‌‌ చేరింది. అంతకుముందు తమ తొలి మ్యాచ్‌‌లో అమ్మాయిలు 175–18తో  సౌత్ కొరియాపై అతి పెద్ద విజయం సాధించారు.