ఖో ఖో వరల్డ్ కప్‌ సెమీఫైనల్లో ఇండియా ఖో ఖో టీమ్స్‌

న్యూఢిల్లీ: తొలి ఎడిషన్ ఖో ఖో వరల్డ్ కప్‌లో ఇండియా మెన్స్‌, విమెన్స్ టీమ్స్‌ సెమీఫైనల్ చేరుకున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన మెన్స్ క్వార్టర్ ఫైనల్లో ఇండియా 100-–40 స్కోరుతో శ్రీలంకను చిత్తు చేసింది. అమ్మాయిల జట్టు 109–16 తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. విమెన్స్ టీమ్ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ 100కి పైగా పాయింట్లు అందుకుంది. శనివారం సెమీస్‌, ఆదివారం ఫైనల్స్ జరుగుతాయి.