బాలీవుడ్ యాక్టర్ పర్విన్ దాబాస్ రోడ్డుప్రమాదంలో గాయపడ్డారు. శనివారం ఉదయం (సెప్టెంబర్ 21న) అతను ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో.. పర్విన్ దాబాస్ తీవ్రంగా గాయపడి ముంబైలోని బాంద్రా హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతని వెంట ఆయన భార్య హీరోయిన్ ప్రీతి జింగ్యానీ ఉన్నారు. ఈ క్రమంలో దబాస్ సహ స్థాపన చేసిన 'ప్రో పంజా లీగ్' ఈ దుర్ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేసింది
"బాలీవుడ్ నటుడు మరియు ప్రో పంజా లీగ్ సహ వ్యవస్థాపకుడు పర్విన్ దబాస్ శనివారం తెల్లవారుజామున దురదృష్టవశాత్తు కారు ప్రమాదంలో బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో ICUలో చికిత్స పొందుతున్నాడు. ఇది తెలియజేయడానికి మేము చాలా చింతిస్తున్నాము. అయితే ఈ క్లిష్టతర సమయంలో మా ఆలోచనలు పర్విన్ మరియు అతని కుటుంబ సభ్యులతో ఉంటాయి. అలాగే పర్విన్ దాబాస్ హెల్త్ అప్‌డేట్‌లను అందిస్తాము. పర్విన్ త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము" అని ప్రకటనలో తెలిపారు.
పర్వీన్ భార్య ప్రీతి జింగానియా ఈ ప్రమాదం గురించి తెలిసి షాక్‌లో ఉన్నామని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన మెడికల్ అప్‌డేట్ ప్రకారం.. అతడికి తీవ్రమైన కండిషన్ ఉందని, ఇంకేమైనా డ్యామేజ్ అవుతుందేమోనని వైద్యులు CT స్కాన్‌లు ఇతర పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అతడు పెద్దగా కదలలేకపోతున్నాడు. లీగ్‌తో పనిభారం ఎక్కువగా ఉండడంతో రాత్రిపూట పని చేస్తూ తెల్లవారుజామున వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు'' అని తెలిపారు.
ALSO READ | మిస్టరీ ఏంటీ: ఆ 27 ఏళ్ల మహిళా సింగర్‌ను విషం ఇచ్చి చంపారా..?
నటుడు పర్విన్ దాబాస్ మాన్సూన్ వెడ్డింగ్, మైనే గాంధీ కో నహీ మారా, ది పర్ఫెక్ట్ హుస్బూండ్, మై నేమ్ ఇస్ ఖాన్ వంటి సినిమాల్లో నటించారు. పర్వీన్ ..హీరో పవన్ కళ్యాణ్ నటించిన 'తమ్ముడు' సినిమాలో హీరోయిన్ ప్రీతి జింగ్యానీని 2008 లో వివాహం చేసుకున్నారు.