Khushbu Sundar: జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌పై..స్పందించిన నటి ఖుష్బూ

Khushbu Sundar: జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌పై..స్పందించిన నటి ఖుష్బూ

మాలీవుడ్ ఇండస్ట్రీలో రిటైర్డ్ జడ్జి హేమ కమిటీ (Hema Committee Report) రూపొందించిన నివేదక ప్రకంపనలు సృష్టిస్తోంది. హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు విస్తుపోయే నిజాలు (విషయాలు) మలయాళ పరిశ్రమలో వెలుగుచూశాయి. మలయాళ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ నివేదిక వెల్లడించింది తెలిసిందే. 

ఈ నేపథ్యంలో నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ (Khushbu Sundar) తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌తో హేమ కమిటీ నీవైదికపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. మహిళలు పనిచేసే ప్రతి పరిశ్రమలో ఇలాంటి (హేమ కమిటీ) రిపోర్ట్‌, కమిషన్లు ఉండాలని తెలియజేశారు. మహిళల సంరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని అన్నారు. 

Also Read:-భారీ బడ్జెట్‍తో అడివి శేష్ ‘G2' మూవీ..ఫస్ట్ పార్ట్ కంటే ఏకంగా16 రెట్లు అధికం!

‘‘మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. మహిళలు పనిచేసే ప్రతీ విభాగంలో జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్ లాంటి కమిషన్‌ ఉండాలి. పలు రంగాల్లో మహిళలు ఈవిధమైన వేధింపులు ఎదుర్కొంటున్నారు. అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పడానికి లేదు. స్త్రీ ఎప్పుడూ స్వతంత్రంగా నిలబడాలి. ఏ సందర్భంలోనూ ఆమె రాజీ పడకూడదు. సర్దుకుపోయే మనస్తత్వం ఉండకూడదు. ఏదైనా విషయంలో మీరు రాజీ పడ్డారంటే ఆ బాధ జీవితాంతం మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది’’ అని ఆమె చెప్పారు.

సినిమా పరిశ్రమ చాలా చిన్న పరిశ్రమ, కానీ, ఇది అత్యధిక డబ్బు సంపాదించే పరిశ్రమ అయినప్పటికీ..భారత ప్రభుత్వం గుర్తించలేదు. కానీ అనేక రంగాలలో..ఒక మహిళ ఈ రకమైన దాడులకు గురవుతుంది. ఇది మనం గుర్తించగలగాలి. అంతేకాకుండా మహిళలు వచ్చి మాట్లాడగలిగే కమిటీలు రూపొందించాలని" తెలిపింది. 

సోషల్‌మీడియాలో అందరూ స్పందించాల్సిన అవసరం లేదన్నారు. స్పందించడం లేదా స్పందించకపోవడం అనేది వారి వ్యక్తిగత విషయం అన్నారు. కానీ, సమస్య ఎదురైన వెంటనే మహిళలు దాని గురించి బయటకు వచ్చి మాట్లాడాలని తెలిపారు.

మలయాళ పరిశ్రమలో లైంగిక వేధింపులను బయటపెట్టడానికి జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌ ఎంతో ఉపయోగపడింది. కెరీర్‌లో రాణించాలనుకుంటే వేధింపులు లేదా కమిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరడం లాంటి పరిస్థితులు మహిళలకు అన్ని రంగాల్లోనూ తరుచూ ఎదురవుతున్నాయి. అయితే, పురుషులకూ ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఎక్కువగా వేధింపులు ఎదుర్కొనేది స్త్రీలే’’అని ఖుష్బూ అభిప్రాయం వ్యక్తం చేసింది.  

అలాగే.."స్త్రీ స్వతంత్రంగా ఉండాలి. ఏ సమయంలోనైనా రాజీ పడకూడదు..ఎదురైనా సందర్భానికి ఏ మాత్రం అడ్జస్ట్ అవ్వకూడదు..పోరాడాలి. ఎందుకంటే, ఒకసారి రాజీ పడడం అనేది జరిగితే, అది మానసికంగా శాశ్వతమైన మచ్చను మిగిల్చగలదని ఖుష్భు నొక్కి చెప్పింది.