NZ vs PAK: న్యూజిలాండ్‌తో వైట్ వాష్.. కోపంతో అభిమానులని కొట్టబోయిన పాక్ క్రికెటర్

NZ vs PAK: న్యూజిలాండ్‌తో వైట్ వాష్.. కోపంతో అభిమానులని కొట్టబోయిన పాక్ క్రికెటర్

న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా పాకిస్థాన్ 0-3 తేడాతో ఓడిపోయింది. అంతకముందు రెండు వన్డేలు ఓడిపోయిన పాక్.. శనివారం (ఏప్రిల్ 5) జరిగిన మూడో వన్డేలోనూ 43 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇప్పటికే టీ20 సిరీస్ ను 1-4 తేడాతో కోల్పోయి తీవ్ర నిరాశలో పాకిస్థాన్ కు.. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ కావడం మరింత విచారానికి గురి చేస్తుంది. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డే తర్వాత పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఖుష్దిల్ షా చేసిన అనుచిత ప్రవర్తన వైరల్ గా మారుతుంది. ఖుష్దిల్ షా ఏకంగా అభిమానులను కొట్టడానికి దూసుకెళ్లాడు.

మ్యాచ్ తర్వాత ఖుష్దిల్ షా అభిమానుల మీదకు దూసుకెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మ్యాచ్ తర్వాత కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు పాకిస్తాన్ క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించారని ఇమ్రాన్ సిద్ధిక్ అనే జర్నలిస్ట్ చెప్పకొచ్చాడు. "మౌంట్ మౌంగనుయ్‌లో ఇద్దరు ఆఫ్ఘన్ వ్యక్తులు పాకిస్తాన్ క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించారు. ఖుష్దిల్ షా వారిని ఆపమని కోరాడు. కానీ వారు అతనిని దుర్భాషలాడుతూనే ఉన్నారు. దీంతో అతను అభిమానుల మీదకు క్రూరంగా దూసుకెళ్లాడు". అని ఆ జర్నలిస్ట్ చెప్పాడు. 

►ALSO READ | జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో సన్ రైజర్స్ ప్లేయర్లు

పాకిస్తాన్ క్రికెటర్ అభిమానులతో వాగ్వాదానికి దిగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది అమెరికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ సందర్భంగా ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ కూడా కొంతమంది అభిమానులతో గొడవకు దిగాడు. పాకిస్తాన్ గ్రూప్-దశలో నిష్క్రమించడంపై అభిమానులు అతనిని తిట్టారని హారిస్ రౌఫ్ ఆరోపించారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మూడవ వన్డేలో వర్షం కారణంగా మ్యాచ్ ను 42 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. ఓపెనర్ రయిస్ మర్యూ, కెప్టెన్ మిచెల్ బ్రేస్ వెల్ ల హఫ్ సెంచరీలతో 42 ఓవర్లలో 264/8 చేసింది.

న్యూజీలాండ్ బ్యాటర్లలో రయిస్ మర్యూ (58), కెప్టెన్ మిచెల్ బ్రేస్ వెల్ (59), డెరైల్ మిచెల్ (43) రాణించారు. ఛేజింగ్ లో బాబర్ అజామ్ 4 ఫోర్లు, 1 సిక్సర్ తో అర్థ సెంచరీ  చేయగా.. రిజ్వాన్ (37),  అబ్దుల్లా షఫిక్  33, తాహిర్ 33 రన్స్ చేశారు. 40 ఓవర్లకు కేవలం 221 రన్స్ చేయగలిగారు. బెన్ సీయర్ 5 వికెట్లు తీసి పాక్ పతనానికి కారణం అయ్యాడు.