పవిత్ర గౌడపై కూతురు ఎమోషనల్ పోస్ట్..

పవిత్ర గౌడపై కూతురు ఎమోషనల్ పోస్ట్..

అభిమాని హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ తో పాటు నటి పవిత్ర గౌడ కూడా అరెస్టైన సంగతి తెలిసిందే. పవిత్ర అరెస్టైన ఎనిమిది రోజుల తర్వాత ఆమె కూతురు ఖుషి పవిత్రను గుర్తు చేసుకుంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్టును షేర్ చేశారు. ఫాదర్స్ డే సందర్బంగా ఖుషి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఖుషి నుదిటిపై పవిత్ర ముద్దు పెడుతున్న సదరు ఫోటో హార్ట్ టచింగ్ గా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. 

అయితే, తన తల్లి అరెస్టుపై ఖుషీ ఇంకా స్పందించలేదు. మరోవైపు, దర్శన్ కొడుకు ఈ కేసు గురించి ప్రస్తావించాడు,తన తండ్రి కేసు గురించి తనను ట్రోల్ చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చాడు. 15 ఏళ్ల దర్శన్ కొడుకు  ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శన్ అరెస్టు ప్రస్తావిస్తూ, “నా తండ్రి పట్ల బ్యాడ్ కామెంట్స్ చేస్తూ, బ్యాడ్ లాంగ్వేజ్ వాడుతున్న వారికి అందరికీ ధన్యవాదాలు, మరియు ఈ కష్ట సమయంలో కూడా మా అమ్మ నాన్నలకు మద్దతు అవసరమని అన్నారు.