
పాకిస్తాన్లోని పెషావర్లో ఓ మసీదు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మతగురువుతో సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం (మార్చి15) సాయంత్రం ఖైబర్ ఫక్తున్ఖ్వాలోని ఓ మసీదులో ప్రార్థన సమయంలో ఈ పేలుడు జరిగింది. శుక్రవారం ఓ మసీదులో పేలుడు జరిగిన 24 గంటల్లో పెషావర్ మసీదులో మరో పేలుడు సంభవించింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పెషావర్ జిల్లాలోని ఉర్మూర్ బాలా గ్రామంలోని ఓ మసీదులో మతపరమైన సమావేశం జరుగుతుండగా తాజా బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో మతగురువు మునీర్ షకీర్ , మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఏరియా మొత్తం తనిఖీలు చేశారు.
ALSO READ | దారుణం: బైక్ పై వచ్చి నడిరోడ్డుపైనే కిరాతకంగా కాల్చి చంపారు..
గత నెలలో దారుల్ ఉలూమ్ హక్కానియా సెమినరీ దగ్గర జరిగిన ఆత్మాహుతి దాడిలో JUI-S నేత మౌలానా హమీదుల్ హక్ హక్కానీ సహా ఆరుగురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు.
ఇదిలా ఉంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఉగ్రవాదులు రైలు దాడిలో చనిపోయిన 26 మంది బందీలలో 18 మంది సైన్యం ,పారామిలిటరీ సైనికులు ఉన్నారని పాకిస్తాన్ సైన్యం ధృవీకరించింది.