ఓఆర్ఆర్ పై కారులో మంటలు

ఓఆర్ఆర్ పై కారులో మంటలు
  •     క్షణాల్లో కియా కారు దగ్ధం

బడంగ్ పేట, వెలుగు : ఓఆర్ఆర్​మీదుగా ఘట్​కేసర్​నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కియా కారులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. తుక్కుగూడ ఎగ్జిట్​నంబర్​14 వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంజిన్​భాగంలో మంటలు చెలరేగి కారు మొత్తం వ్యాపించినట్లు అటుగా వెళ్తున్న వాహనదారులు తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తి అప్రమత్తమై పక్కకు ఆపి దిగినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని పహాడీషరీఫ్​ఇన్​స్పెక్టర్ గురువారెడ్డి తెలిపారు.