2న కియా ఎలక్ట్రిక్ కారు విడుదల.. మొదలైన బుకింగ్స్

కియా కంపెనీ ఎలక్ట్రిక్ కారు ‘ఈవీ6’తొలిసారిగా భారత మార్కెట్లో జూన్ 2న విడుదల కానుంది.దీనికి సంబంధించిన బుకింగ్స్ ను ప్రారంభించినట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. దేశంలోని 12 నగరాల్లో ఎంపిక చేసిన 15 మంది డీలర్ల వద్ద  రూ.3 లక్షలను అడ్వాన్స్ గా  చెల్లించి ఈవీ6 కారును బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. కారును బుక్ చేసుకోవాలని భావించేవారు www.kia.com/in/ వెబ్ సైట్ ను కూడా సందర్శించవచ్చని కంపెనీ సూచించింది. ఈ ఏడాదిలో తొలివిడతగా భారత్ లో 100 మందికి ఈవీ6ను విక్రయిస్తామని కియా పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.40 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

ఫీచర్లు ఇవీ.. 

  • 350 కిలోవాట్ల చార్జర్ తో ఈ కారు వస్తుంది. 18 నిమిషాల్లోనే  80 శాతం చార్జింగ్ అవుతుంది. 
  • ఈ కారులోని బ్యాటరీ నుంచి చిన్నపాటి ఇంట్లోని ఏసీకి అవసరమైన విద్యుత్ ను కూడా అందించొచ్చు. ఇందుకోసం 2వే చార్జర్ ను వాడాల్సి ఉంటుంది. 
  • మల్టీ చార్జింగ్ సిస్టమ్ ను ఈ కారు సపోర్ట్ చేస్తుంది. 400 ఓల్టేజీ, 800 ఓల్టేజీ కలిగిన విభిన్న చార్జర్లనూ వాడొచ్చు.  

మరిన్ని వార్తలు..

తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం పక్కా

మూఢనమ్మకాలు నమ్మేవాళ్లు తెలంగాణను ఉద్ధరించలేరు