ఇండియాలో తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ సెల్టోస్‌కు మంచి ఆదరణ దక్కుతోందని, కేవలం 46 నెలల్లోనే 5 లక్షల యూనిట్లను అమ్మామని కియా ఇండియా పేర్కొంది. నాలుగేళ్ల కిందట సెల్టోస్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేశామని వెల్లడించింది. మేకిన్ ఇండియాలో భాగంగా తెచ్చిన ఈ మోడల్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో గేమ్ చేంజర్‌గా మారిందని వివరించింది. ఈ ఏడాది జనవరి – మార్చి లో 9 వేల యూనిట్లు అమ్మింది.
100 ట్రియో ఆటోలు ప్రారంభం
వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే సందర్భంగా మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ (ఎల్‌ఎంఎం) బేగంపేట నుంచి 100 ట్రియో ఎలక్ట్రిక్ ఆటోలను జెండా ఊపి ప్రారంభించింది. రాష్ట్ర ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీని ప్రమోట్ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఎం అండ్ ఎం ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
కేవలం మహిళలతో నడిచే వెస్టిన్ హోటల్
కేవలం మహిళలతో నడిచే హోటల్‌ను వెస్టిన్ హోటల్స్ అండ్ రిసోర్ట్స్ హైటెక్ సిటీలో ప్రారంభించింది. సిటీలో ఇలాంటి హోటల్ రావడం ఇదే మొదటిసారి. ఈ హోటల్‌లో 168 గెస్ట్ రూమ్స్, సూట్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో విస్తరించడం ఆనందంగా ఉందని మారియట్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రంజు అలెక్స్ పేర్కొన్నారు. కేవలం మహిళలతో నడిచే హోటల్‌ను తీసుకురావడంతో హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కొత్త మార్పులు రాబోతున్నాయని అన్నారు.