
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్‌ను మార్చడం కోసం తమ మిడ్-సైజ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ సెల్టోస్ 4,358 యూనిట్ల (పెట్రోల్ వేరియంట్)ను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు కియా ఇండియా శుక్రవారం తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 28– జులై 13, 2023 మధ్య తయారైన ఐవీటీ ట్రాన్స్‌మిషన్ గల స్మార్ట్ స్ట్రీమ్జీ 1.5 సెల్టోస్‌ను కంపెనీ రీకాల్ చేస్తోంది. ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్‌లో లోపం కారణంగా ఈ వెహికల్స్‌ను వెనక్కి రప్పిస్తున్నామని తెలిపింది. ఉచితంగానే మారుస్తామని తెలిపింది.