దక్షిణ కొరియా సంస్థ కియా(Kia) నుంచి మరో కొత్త కారు వస్తోంది. సరికొత్త ఎస్‌యూవీ కియా సిరోస్(Kia Syros) శనివారం (ఫిబ్రవరి 1) నుంచి భారత మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. మొత్తం ఆరు వేరియంట్లు(HTK, HTK (O), HTK plus, HTX, HTX plus, HTX plus (O))లో కియా సిరోస్ అందుబాటులో ఉండనుంది.
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని తయారీ యూనిట్‌లో తయారైన ఈ కార్లకు భారీ డిమాండ్ ఉంది. ఇప్పటికే 25వేలకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. భద్రతా రేటింగ్ పరంగా తిరుగులేదు. NCAP నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. దీని ధరలు రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. అధికారిక ధరలు శనివారం వెల్లడి కానున్నాయి.
కియా సిరోస్
ఇదొక కాంపాక్ట్ SUV కారు. వెనుక సీటు స్థలం కియా సోనెట్ కంటే ఎక్కువగా ఉంటుంది. కియా సిరోస్ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందించారు. అదే సమయంలో డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్ ఇంజన్ అందించారు.
ఈ కియా కారులో అనేక పవర్‌ఫుల్ ఫీచర్లు ఉన్నాయి. వెలుపల విషయానికొస్తే.. నిలువుగా పేర్చబడిన LED హెడ్‌లైట్లు, టైల్‌లైట్లు, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, చంకీ బాడీ క్లాడింగ్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, షార్క్-ఫిన్ యాంటెన్నా ఉన్నాయి.
Also Read :- నేను వెళ్లి స్విమ్మింగ్ చేయాలా ఏంటీ?
ఇక లోపల విషయానికొస్తే.. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్ 2 ADAS సూట్, 360 డిగ్రీ కెమెరా, 12.3 టచ్‌స్క్రీన్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌లు, వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీ, EPB వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV3XO, రెనాల్ట్ కిగర్ వంటి కార్లకు కియా సిరోస్ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
🚗✨ Kia Syros in stunning colors! 🎨🔥
— UTKAL KIA (@KiaUtkal) January 31, 2025
A bold SUV deserves bold choices! Which shade is your favorite? 🤩#Kia #KiaSyros #ColorOptions #AutoExpo2025 #KiaIndia #MovementThatInspires #Innovation #Future #utkalkia #utkalkiajamshedpur pic.twitter.com/zzuAwoUOxA