వైరల్ అవుతున్న కియారా పొట్టి స్కర్ట్.. ధర తెలిస్తే మతిపోతుంది

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara advani) ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. తాజాగా ఆమె నటించిన "సత్య ప్రేమ్ కి కథ(Sathya prem ki katha)" మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కియారా అద్వానీ.. పొట్టి డ్రెస్సే తో హల్ చల్ చేసింది. ఇక ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. 

Also Read : వెస్టిండీస్ సిరీస్ : రోహిత్ శర్మనే కెప్టెన్.. పుజారా ఔట్

ఇక తాజాగా ఈ ఫోటోకు సంబందించిన మరో న్యూస్ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. ఈ ఫొటోలో కియారా వేసుకున్న పొట్టి స్కర్ట్ ధర. ఆవును ఆ స్కర్ట్ ధర తెలుసుకొని నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఆ పింక్ కలర్ స్కర్ట్ దర ఎంతంటే.. అక్షరాలా రూ.98 వేలు. అవును నిజమే ఆ స్కర్ట్ ధర రూ.98 వేలే. ఇది తెలుసుకున్న చాలా మంది.. ఏంటి ఆ పొట్టి స్కర్ట్ ధర రూ.98 వేలా అంటూ అవాక్కవుతున్నారు. ఇంకొందరైతే.. రూ.98 వేలా.. నా వన్ మంత్ సాలరీ కన్నా ఎక్కువ.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.