స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు, కియారా అద్వానీ తన షూటింగ్ షెడ్యూల్ నుంచి కాస్త విరామం తీసుకుంది. అట్టారీ-వాఘా సరిహద్దులో బీఎస్ఎఫ్(BSF) సైనికులతో కొంత సమయం గడిపింది. కొన్ని వినోద కార్యక్రమాలలో కూడా పాల్గొంది. ఒక వీడియోలో కియారా త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ లేత గోధుమరంగు, ఆకుపచ్చ షేడ్స్‌లో అందమైన సల్వార్-సూట్ ధరించి ఆర్మీ ఈవెంట్‌కు హాజరవుతున్నట్లు కనిపించింది. ఈ టూర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో తెగ షేర్ అవుతున్నాయి.
అంతే కాకుండా యూనిఫాంలో ఉన్న ఆ సైనికులతో కియారా కొన్ని ఫొటోలు కూడా తీసుకుంది. BSF బూట్ క్యాంప్‌ను సందర్శించి, సైనికులతో మొక్కలు నాటడం వంటి వివిధ కార్యక్రమాలలో పాల్గొంది. తన పర్యటనలో, కియారా సైనికులతో సంభాషిస్తూ ఫొటోలకు కూడా పోజులిచ్చింది.
ఇక కియారా సినిమా విషయాలకొస్తే.. ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ ఛేంజర్' లో కనిపించనుంది. ఈ చిత్రంలో, రామ్ చరణ్ IAS ఆఫీస్ పాత్రలో కనిపించనుండగా, కియారా కథానాయికగా అలరించనుంది. వీరితో పాటు అంజలి, SJ సూర్య, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నాజర్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ థమన్ ఈ చిత్రానికి పాటలను కంపోజ్ చేస్తున్నారు.