కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి పెళ్లి చేసుకుంది ఈ ఏడాదే కదా..! ఇంత పెద్ద చిన్నారి ఎవరా? అని ఆశ్చర్యపోకండి.. ఈ బాలిక వారి కుమార్తె కాదు.. ఓ విదేశీ క్రికెటర్ గారాల పట్టి. పేరు.. కియారా. ఆ చిన్నారి తండ్రి.. క్వింటన్ డికాక్. 16 ఏళ్లకే ఓ అందమైన బుట్టను ప్రేమలో పడేసి.. ఐదేళ్లు డేటింగ్ చేసి.. ఆ తరువాత పెళ్లాడిన మహామేధావి.. అతగాడు.
వికెట్ కీపర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరైన డికాక్‌కు ఇండియాతో మ్యాచ్ అంటే ప్రాణం లేచోచ్చేది. కెరీర్ తొలి రోజుల్లో చెలరేగి ఆడేవాడు. ఒక ఎండ్‌లో సహచర బ్యాటర్లు వీడుతున్నా.. తాను ఒంటరి సైనికుడిలా పోరాడి శతకాలు బాదేవాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇండియాతో మ్యాచ్‌లే దక్షిణాఫ్రికా జట్టులో అతని స్థానాన్ని పదిలం చేశాయి. విధ్వంసకర అంతర్జాతీయ క్రికెటర్‌గా అధిక గుర్తింపు తెచ్చి పెట్టాయి.
2013లో ఐపీఎల్ అరంగేట్రం
క్వింటన్ డికాక్ 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకూ 100 మ్యాచ్‌లు ఆడిన అతను 32.47 సగటుతో 3,052 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల తరుపున ఆడిన డికాక్‌ను.. ఐపీఎల్ 2024 వేలంలో, లక్నో ఫ్రాంచైజీ రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది.
ప్రస్తుతం డికాక్ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కావడం, అతని ఫ్యామిలీ ఇక్కడే ఉండటంతో సహచర ఆటగాళ్లు ఆ చిన్నారిని ఎత్తుకొని ఫోటోలకు పోజులిస్తున్నారు. అలా లక్నో సారథి కేఎల్ రాహుల్ కూడా ఆ బాలికతో కాసేపు ఉల్లాసంగా గడిపాడు. అందుకు సంబంధించిన ఫోటోను లక్నో ప్రాంచైజీ తమ అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది.
Your wholesome content of the day 💙🫶 pic.twitter.com/wBw4PUIjkB
— Lucknow Super Giants (@LucknowIPL) April 9, 2024
కాగా, డి కాక్ తన స్నేహితురాలు సాషా హర్లీని సెప్టెంబర్ 2016లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె.. పేరు కియారా. జనవరి 2022లో ఈ చిన్నారి జన్మించింది.