Max movie day 3 collections: కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ హీరోగా నటించిన మ్యాక్స్ సినిమా క్రిస్మస్ సందర్భంగా బుధవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి కన్నడ స్టార్ డైరెక్టర్ విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించగా వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, సుకృత వాగ్లే మరియు అనిరుధ్ భట్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.వి క్రియేషన్స్‌పై కలైప్పులి ఎస్. థాను, కిచ్చా క్రియేషన్స్‌పై సుదీప్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా ప్రముఖ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు.
అయితే రిలీజ్ రోజు రూ.8.25 కోట్లు డీసెంట్ కలెక్షన్లు రాబట్టింది. కానీ మిక్స్డ్ టాక్ ఉండటంతో రెండో రోజు దాదాపుగా 55% శాతానికిపైగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. దీంతో గురువారం కేవం రూ.3.75 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కానీ మూడో రోజు స్వల్పంగా పెరిగాయి. ఈ క్రమంలో శుక్రవారం 4.75 కోట్లు కలెక్ట్ చేసింది.
దీంతో sacnilk సమాచారం ప్రకారం 3 రోజులకిగాను 16.75 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చెయ్యగా కర్ణాటకలోతప్ప ఇతర ప్రాంతాల్లో పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది. వారాంతానికి ఇంకా రెండు రోజులు ఉండటం, ప్రస్తుతం కన్నడలో బిగ్ బడ్జెట్ సినిమాలు లేకపోవడంతో మ్యాక్స్ కి కొంతమేర కలసివచ్చే అంశం.