కన్నడ స్టార్ సుదీప్ హీరోగా నటించిన చిత్రం ‘మ్యాక్స్’. విజయ్ కార్తికేయ దర్శకుడు. సునీల్, వరలక్ష్మి శరత్ కుమార్, లోహితస్య కీలకపాత్రలు పోషించారు. సుదీప్‌కు చెందిన కిచ్చా క్రియేషన్స్‌తో కలిసి తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించారు.
తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మా పొలిటికల్ కెరీర్ కి ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్’ అనే వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. బ్రూతల్ విలన్‌గా సునీల్, పొలిటీషియన్‌గా లోహితస్య కనిపించారు.
పోలీస్ ఆఫీసర్‌గా వరలక్ష్మి కీలకపాత్ర పోషించింది. విలన్ గ్యాంగ్ అంతా పోలీస్ స్టేషన్‌ను చుట్టుముడుతుంటారు. ఆ టైమ్‌లో ఎంట్రీ ఇచ్చిన సుదీప్.. ‘ఈ ఒక్క రోజు రాత్రి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపడదాం.. మొత్తం క్లీన్ చేసి పారేద్దాం’ అంటూ విలన్స్ అందరినీ చితక్కొడుతుంటాడు.
‘సేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చే ప్రతి పకోడీ గాడు సమాజ సేవకుడే’ లాంటి పొలిటికల్ పంచ్‌లతో పాటు ‘మ్యాక్స్‌తో మాట్లాడేటప్పుడు మ్యాగ్జిమమ్ సైలెన్స్ ఉండాలి’ అనే డైలాగ్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. మొత్తానికి ఒక్క రాత్రిలో జరిగే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇదని అర్థమవుతోంది. డిసెంబర్ 27న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా తెలుగులో ఈ చిత్రం విడుదల కాబోతోంది.