దాదాపు 150 కోట్ల జనాభా గల దేశం మనది. గల్లీకో పది మంది క్రికెటర్లు చొప్పున.. ఊరికొక యాభై మందిని వేసుకున్నా.. నాలుగు జట్లు తయారవుతాయి. ఈ లెక్కన మండలాకెన్ని..? జిల్లాకెన్ని..? రాష్ట్రానికెన్ని జట్లు తయారు అవుతాయో చెప్పండి..! ఇంత మంది క్రికెటర్లున్న మన దేశంలో.. జాతీయ జట్టు తరుపున ఆడే అవకాశం ఎంత మందికొస్తుందో ఊహించండి. ఇదే ప్రశ్న ఓ బుడతడి మదిలో మెదిలింది. ఇంకేముంది భారత స్టార్ తన ముందుండేసరికి ఆపుకోలేక అడిగేశాడు. భారత క్రికెటర్ అవ్వాలంటే ఏం చేయాలి..? అని.. అందుకు కోహ్లీ చెప్పిన సమాధానమేంటో తెలుసా..!
ఢిల్లీ జట్టు తరుపున రంజీ బరిలో కోహ్లీ.. అరుణ్ జెట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా అక్కడికి ఓ అతిథి వచ్చాడు. అతని పేరు.. కబీర్. ఓ స్కూల్ విద్యార్థి.. కోహ్లీ స్నేహతుడి కుమారుడు. ఆ పిల్లాడి తండ్రి, కోహ్లీ కలిసి గతంలో ఒకే జట్టు తరుపున గల్లీ క్రికెట్ ఆడారట. విరాట్ అరుణ్ జెట్లీ స్టేడియానికి వస్తున్నారనే విషయం తెలుసుకొని.. ఇద్దరూ మైదానానికి వెళ్లారు. కోహ్లీ నెట్స్‌లో చెమటోడుస్తుంటే.. ఇద్దరూ అతన్నే గమనిస్తూ కూర్చున్నారు.
Also Read :- ఐసీసీ ర్యాంకింగ్స్.. ఐదో స్థానానికి వరుణ్ చక్రవర్తి
కొద్దిసేపటి తరువాత కోహ్లీ ప్రాక్టీస్ ముగియడంతో.. వారితో కాసేపు ముచ్చటించాడు. ఆ సమయంలో స్నేహితుడు కుమారుడు కోహ్లీపై ప్రశంసల వర్షమే కాదు.. ప్రశ్నల వర్షం కురిపించాడడు. తనతో పాటు తన స్నేహితులందరూ అతని అభిమానులనే అని కోహ్లీకి చెప్పాడు. నవ్వులు పంచాడు.. ఈ మాటల్లోనే ఓ చిక్కు ప్రశ్న అతనికి సంధించాడు. "భారత క్రికెటర్‌గా ఎదగాలంటే ఏం చేయాలి..?" అని కోహ్లీని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన కోహ్లీ.. అతనికి ఎంతో విలువైన సూచనలు ఇచ్చాడు.
కోహ్లీ ఇచ్చిన సమాధానం..
"బాగా కష్టపడాలి. ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలి. ప్రాక్టీస్ చేయమని మీ తండ్రి చెప్పేవరకు వేచి చూడకూడదు. నీవంతకు నీవుగా ప్రాక్టీస్ కు వెళ్ళాలి. ఇతరులు ఒక గంట ప్రాక్టీస్ చేస్తే, నీవు రెండు గంటలు కష్టపడాలి. ఇతరులు 50 పరుగులు చేస్తే, నీవు 100 పరుగులు చేయాలనే కసితో ఆడాలి. అదొక్కటే మార్గం.." అని కోహ్లీ ఎంతో సూచనలు బుడతడి బోధించాడు. వీరి సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది."
A beautiful little chat between Virat Kohli and a young kid. ❤️ pic.twitter.com/raeR7gUyiy
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2025