థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ సూపర్‌‌‌‌–300 టోర్నీలో శ్రీకాంత్‌‌‌‌ బోణీ

థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ సూపర్‌‌‌‌–300 టోర్నీలో శ్రీకాంత్‌‌‌‌ బోణీ

పతుమ్వాన్ (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌): ఇండియా ప్లేయర్‌‌‌‌, మాజీ వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌ కిడాంబి శ్రీకాంత్‌‌‌‌.. థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ సూపర్‌‌‌‌–300 టోర్నీలో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో శ్రీకాంత్‌‌‌‌ 21–13, 21–18తో డేనియల్ డుబోవెంకో (ఇజ్రాయిల్‌‌‌‌)పై నెగ్గాడు. 36 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో శ్రీ మునుపటి ఫామ్‌‌‌‌ను చూపెట్టాడు. 6–0తో తొలి గేమ్‌‌‌‌ను మొదలుపెట్టి వరుస పాయింట్లతో హోరెత్తించాడు. 

రెండో గేమ్‌‌‌‌లోనూ అదే జోరును కంటిన్యూ చేశాడు. 11–7తో మొదలైన గేమ్‌‌‌‌లో ఎక్కడా స్కోరును సమం చేసే చాన్స్‌‌‌‌ ఇవ్వలేదు. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో ఆయూష్‌‌‌‌ షెట్టి 15–21, 17–21తో జింగ్‌‌‌‌ హాంగ్‌‌‌‌ కాక్‌‌‌‌ (మలేసియా) చేతిలో, మిథున్‌‌‌‌ మంజునాథ్‌‌‌‌ 14–21, 13–21తో షోలే ఆదిల్‌‌‌‌ (మలేసియా) చేతిలో ఓడారు. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో రోహన్‌‌‌‌ కపూర్‌‌‌‌–రుత్వికా శివాని 21–8, 21–16తో వీరఫత్ ఫక్జరుంగ్–సరరత్ చూబోకా (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌)పై , మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో రూబెన్‌‌‌‌ కుమార్‌‌‌‌–హరిహరన్‌‌‌‌ 21–18, 21–12తో పన్నావత్ జమ్తుబిమ్‌‌‌‌– రట్చపోల్ మక్కసాసితోర్న్ (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌)పై నెగ్గి రెండో రౌండ్‌‌‌‌లోకి ప్రవేశించారు.