ఇప్పుడే బాగా ఆడుతున్నా

ఇప్పుడే బాగా ఆడుతున్నా

 

  • మరిన్ని మెడల్స్​ గెలవాలి    
  • 2017 కంటే ఇప్పుడే బాగా ఆడుతున్నా
  • కరెక్ట్​ టైమ్​లో ఫామ్​లోకి వచ్చా
  • టోక్యోకు క్వాలిఫై కాలేదని బాధ పడ్డా:  కిడాంబి శ్రీకాంత్‌‌‌‌

ఒలింపిక్స్‌‌‌‌తోనే  ప్రపంచం ఆగిపోదని తెలుసుకున్నా టోక్యో ఒలింపిక్స్‌‌‌‌కు క్వాలిఫై అవ్వనందుకు బాధ పడ్డా. కరెక్ట్‌‌‌‌గా చెప్పాలంటే ఒలింపిక్స్‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌లో ఇండియా మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ నుంచి నేనే టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ఉన్నా. కానీ, చాలా క్వాలిఫికేషన్‌‌‌‌ టోర్నీలు కరోనా వల్ల క్యాన్సిల్‌‌‌‌ అయ్యాయి. జరిగిన కొన్ని టోర్నీల్లో గాయం వల్ల నేను ఆడలేకపోయా. అంతా  అనుకున్నట్టు జరిగి ఉంటే నేను ఒలింపిక్స్‌‌‌‌లో ఆడేవాడినేమో.  అయితే,  ఒలింపిక్స్‌‌‌‌తోనే  ప్రపంచం ముగిసిపోదని నేను రియలైజ్ అయ్యా. నన్ను నేను ప్రూవ్‌‌‌‌ చేసుకునేందుకు ముందు చాలా చాన్స్‌‌‌‌లు లభిస్తాయని అనుకొని కష్టపడ్డా. ఈ మెడల్‌‌‌‌తో ఆ కష్టానికి ప్రతిఫలం దక్కిందని అనుకుంటున్నా. 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:బ్యాడ్మింటన్‌‌‌‌లో  వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, అలాంటి టోర్నీలో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉందని ఇండియా స్టార్​ షట్లర్‌‌‌‌ కిడాంబి శ్రీకాంత్‌‌‌‌ అన్నాడు. 2017లో నాలుగు సూపర్‌‌‌‌ సిరీస్‌‌‌‌ టైటిల్స్‌‌‌‌, 2018లో వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ అందుకున్న తర్వాత గాయాల వల్ల చాలా ఇబ్బంది పడ్డానని చెప్పాడు. ఆ టైమ్‌‌‌‌లో తనపై నమ్మకం కోల్పోకుండా ముందుకెళ్లానన్నాడు. ప్రస్తుతానికి  ఇంజ్యురీ ఫేజ్‌‌‌‌ ముగిసి, తన ఆటపై కాన్ఫిడెన్స్‌‌‌‌ పెరిగిందన్న శ్రీకాంత్‌‌‌‌.. వచ్చే ఏడాది చాలా పెద్ద టోర్నీలున్న  నేపథ్యంలో కరెక్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌లో టాప్‌‌‌‌ ఫామ్‌‌‌‌లోకి వచ్చానని అభిప్రాయపడ్డాడు. 2017లో మంచి ఫామ్‌‌‌‌లో ఉన్నప్పటితో పోల్చితే  ఇప్పుడే బాగా ఆడుతున్నానని తెలిపాడు.  కెరీర్‌‌‌‌లో బెస్ట్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ ఇంకా రాలేదన్న  శ్రీ ఫ్యూచర్‌‌‌‌లో మరింత బాగా రాణిస్తానన్నాడు.  వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌ గెలిచి హైదరాబాద్‌‌‌‌కు తిరిగొచ్చిన శ్రీకాంత్‌‌‌‌కు మంగళవారం గోపీచంద్ అకాడమీలో గ్రాండ్​ వెల్​కం లభించింది. అనంతరం శ్రీకాంత్​ మీడియాతో ముచ్చటించాడు. ఆ వివరాలు అతని మాటల్లోనే...

విమర్శలకు సమాధానం కాదు..
కొన్నాళ్లుగా బాగా ఆడకపోవడంతో నాపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ  మెడల్‌‌‌‌ వాటికి  సమాధానం అనుకోవడం లేదు. నేనేంటో ఎవరికో ప్రూవ్‌‌‌‌ చేసుకోవాలని అనుకోలేదు. నేనింకా పోటీలో ఉన్నానని, నాకు నేను బెస్ట్‌‌‌‌ అనిపించుకోవాలని అనుకున్నా. గెలిచే సత్తా నాలో ఉందని నమ్మి కష్టపడుతూ వచ్చా. అప్పుడే గెలవాల్సింది.. ఇప్పుడు సాధించా
ఈ మెడల్​తో హిస్టరీ క్రియేట్​ చేసినప్పటికీ మెన్స్​ సింగిల్స్​లో ఇండియాలో నేనే బెస్ట్​ ప్లేయర్​ను అనుకోవడం లేదు. నా బెస్ట్‌‌‌‌ ఇంకా రాలేదు. ఫ్యూచర్​లో మరిన్ని మెడల్స్​ గెలవాలి. నిజానికి, 2017లో మంచి ఫామ్‌‌‌‌లో ఉన్నప్పుడే ఈ టోర్నీలో మెడల్‌‌‌‌ గెలుస్తానని అనుకున్నా. కానీ, సాధ్యం కాలేదు. ఈసారి నాపై ఎలాంటి అంచనాలు లేవు. మ్యాచ్‌‌‌‌ బై మ్యాచ్‌‌‌‌ నా బెస్ట్‌‌‌‌ ఇవ్వాలని అనుకున్నా. ఆ నమ్మకంతోనే ముందుకెళ్లి మెడల్‌‌‌‌ గెలిచా. 2017తో పోల్చితే ఇప్పుడే బాగా ఆడుతున్నానని అనుకుంటున్నా. 

 ఇది సెకండ్‌‌‌‌ బిగినింగ్‌‌‌‌ కాదు 
రెండేళ్ల తర్వాత నాకు ఈ మెడల్ వచ్చింది. అయినా నా కెరీర్‌‌‌‌కు ఇది సెకండ్‌‌‌‌ బిగినింగ్‌‌‌‌ అనుకోవడం లేదు. నా వరకు చేయగలిగినంత చేస్తున్నా. ఇకముందూ అదే కంటిన్యూ చేస్తా.  ఫిట్​గా ఉన్నంతకాలం ఆడుతూ వీలైనన్ని టోర్నీలు గెలిచేందుకు ట్రై చేస్తా.  ప్రతి టోర్నీలో నేను విన్‌‌‌‌ అవ్వాలనే ఆడతా.

కామన్వెల్త్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ కొడతా
2022లో చాలా పెద్ద టోర్నీలు ఉన్నాయి.  మార్చిలో ఆల్‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌, తర్వాత కామన్వెల్త్‌‌‌‌, ఏషియన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌, వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌ ఉంటాయి. కాబట్టి కరెక్ట్ టైమ్‌‌‌‌లో నేను పీక్‌‌‌‌ స్టేజ్‌‌‌‌కు వచ్చినందుకు హ్యాపీగా ఉన్నా. ప్రస్తుతానికి నా ఇంజ్యురీ ఫేజ్‌‌‌‌ ముగిసిందని భావిస్తున్నా. నా ఫిజికల్‌‌‌‌ స్టేట్‌‌‌‌,  కోర్టులో మూమెంట్‌‌‌‌పై చాలా కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నా.  ఇకపై ఇదే ఫామ్‌‌‌‌ను కంటిన్యూ చేయాలనుకుంటున్నా.  గత కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో ఇండివిడ్యువల్‌‌‌‌ సిల్వర్‌‌‌‌ గెలిచా. ఈ సారి గోల్డ్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌ పెట్టా. ఏషియన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ మెడల్‌‌‌‌ సాధించాలని అనుకుంటున్నా.  ఒలింపిక్స్‌‌‌‌పై టార్గెట్‌‌‌‌ కచ్చితంగా ఉంటుంది. కానీ, పారిస్‌‌‌‌ గేమ్స్‌‌‌‌కు ఇంకా చాలా టైమ్‌‌‌‌ ఉంది. 
మళ్లీ నం.1 ర్యాంక్‌‌‌‌లో చూడొచ్చు
నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ హోదా ఎలా ఉంటుందో చూశా.  కాబట్టి ఇప్పుడు నేను ఏ ర్యాంక్‌‌‌‌లో ఉన్నా ఒకేలా అనిపిస్తుంది. అంత ఎత్తు చూశాక ఇంక ఎక్కడున్నా పెద్దగా డిఫరెన్స్​ ఏమీ ఉండదు. అయితే, నన్ను మళ్లీ నం.1 ర్యాంక్‌‌‌‌లో కచ్చితంగా చూడొచ్చు. 

అప్పుడే పెండ్లి ఆలోచన లేదు
నా ఏజ్‌‌‌‌ 28.  ఇప్పటికైతే పెండ్లి ఆలోచన ఏమీ లేదు (నవ్వుతూ). నాకో అన్న (షట్లర్‌‌‌‌ నందగోపాల్‌‌‌‌) ఉన్నాడు. తనకే ఇంకా మ్యారేజ్‌‌‌‌ కాలేదు. కాబట్టి నా మ్యారేజ్​కు చాలా టైమ్​ ఉంది.