నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో కిడ్నాప్ కలకలం

నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఓ వ్యక్తిని చితకబాది.. TS 29 C 6688 నంబరున్న క్రేటా కారులో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాపర్లు వెళ్తున్న కారుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డవడంతో.. పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.

వీడియోలోని కారు నంబరు ఆధారంగా అది సింగం బాగయ్య యాదవ్ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు మరిన్ని క్లూస్ కోసం సీసీ కెమెరాలో రికార్డయిన కారు విజువల్స్ ని పోలీసులు చెక్ చేస్తున్నారు. కాగా, నిజామాబాద్ బైపాస్ నుంచి కారు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.