మెట్పల్లిలో కిడ్నాప్ అయిన బాలుడు దొరికాడు..24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

మెట్పల్లిలో కిడ్నాప్ అయిన బాలుడు దొరికాడు..24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

సోషల్ మీడియా పనిచేసింది..అవును..కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీని కనుగొనేందుకు పోలీసుల పనిని సులభం చేసింది.బాలుడి మిస్సయినట్టు ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్ ని సోషల్ మీడియాలో  పోస్ట్ చేసి ప్రచారం చేశారు. కిడ్నాప్ అయిన రెండేళ్ల బాలుడి ఆచూకీని 24 గంటల్లో ఛేదించారు. 

జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో కిడ్నాప్ కేసు ఛేదించారు పోలీసులు.. మంగళవారం ఆగస్టు 13, 2024న మిస్సయిన రెండేళ్ల బాలుడి ఆచూకీ 24 గంటల్లోనే కనుగొన్నారు. సీసీఫుటేజ్ ఆధారంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసి నిందితుడిని పట్టుకున్నారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. రూ. 50వేలకు బాలుడిని అమ్మేందుకు నిందితుడు ప్రయత్నించినట్లు పోలీసులు చెప్పారు.

మంగళవారం అక్కతో కలిసి కిరాణాషాపు కు వెళ్లిన రెండేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. అక్క అమ్ములును కిడ్నాపర్ ఏమార్చి బాలుడిని ఎత్తుకుపోయినట్లు తల్లిదండ్రులు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సీసీపుటేజ్ పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలుడి ఆచూకీ ని తెలుసుకున్నారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.