Hyderabad : నిలోఫర్ హాస్పిటల్లో పసికందు కిడ్నాప్

హైదరాబాద్  నిలోఫర్ హాస్పిటల్ లో గుర్తు తెలియని మహిళ పసికందును  కిడ్నాప్ చేసింది.  జహీరాబాద్ కు చెందిన హసీనా బేగం, గఫర్ దంపతులకు చెందిన  నెల రోజుల బాబును  వైద్యం కోసం నిలోఫర్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు.  ఆసుపత్రి సిబ్బంది అని చెప్పిన గుర్తు తెలియన మహిళ చిన్నారిని తీసుకెళ్లింది.

 ఎంతసేపైనా బాబును తీసుకురాకపోవడంతో చిన్నారి తల్లి  నాంపల్లి పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు నాంపల్లి పోలీసులు. ఆస్పత్రిలో  సెక్యూరిటీ వైఫల్యం వల్లనే తమ బాబు అదృశ్యం అయ్యారని ఆరోపిస్తోంది చిన్నారి తల్లి