సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త మార్గంలో నేరాలకు పాల్పడుతున్నారు. డబ్బున్న వాళ్లు.. వ్యాపారులను టార్గెట్ గా చేసుకుంటున్నారు. దీని కోసం కొందరు అమ్మాయిలను ఎరగా వేసి మోసాలకు పాల్పడుతున్నారు. లేటెస్ట్ గా రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో బట్టల వ్యాపారి కిడ్నాప్ కలకలకం రేపుతోంది. ఫ్లాట్ ఉందంటూ వ్యాపారికి కాల్ చేయించి కిడ్నాప్ చేశారు.
అసలేం జరిగిందంటే..? ఇబ్రంహీం పట్నంకు చెందిన బట్టల వ్యాపారీ రచ్చ నారాయణకు ఒక లేడీస్ వాయిస్ తో కార్ ఇన్సురెన్స్ అంటూ కాల్ వచ్చింది. మాయమాటలు చెప్పి బొంగలూరు మెట్రో సిటీ దగ్గర కమర్షియల్ ఫ్లాట్ ఉందని..తక్కువ ధరకే ఫ్లాట్ మీకు నచ్చుతుందని ఒక్కసారి అక్కడికి రావాలని చెప్పారు. దీంతో వాళ్ల మాటలు నమ్మిన వ్యాపారీ డ్రైవర్ ను తీసుకుని కారులో చెప్పిన అడ్రస్ కు వెళ్లారు. కారు దిగగానే వెంటనే బట్టల వ్యాపారీ వెనక నుంచి వచ్చి తలకు గుడ్డ కట్టి కిడ్నాప్ చేశారు.
బట్టల వ్యాపారీని ఒక రూమ్ లో బంధించి తలకు గన్ పెట్టి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఇంత సడెన్ గా కోటి రూపాయలు ఎలా వస్తాయని అన్నాడు. దీంతో విలువైన 10 డాక్యుమెంట్లపైన సంతకాలు తీసుకుని అతడిని రింగ్ రోడ్డు దగ్గర వదిలిపెట్టి పారిపోయారు. అనంతరం బాధితుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆదిభట్ల పీఎస్ లో కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరు కిడ్నాప్ చేశారు.? లేడి వాయిస్ తో ఫోన్ ఎందుకు చేయించారు. ఫ్లాట్ కొనుగోలు చేస్తారా అని అడిగి.. డాక్యుమెంట్లపైన సంతకాలు ఎందుకు తీసుకున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.