
హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెల మండిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. బేగం బజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక...తన సోదరుని..కుమార్తె ప్రగతితో కలిసి నిన్న సాయంత్రం తన పుట్టిల్లు కట్టెల మండికి వచ్చారు. ఆడుకోవడానికి బంధువుల పిల్లలతో ముత్యాలమ్మ గుడి దగ్గరకు వెళ్లిన ప్రగతి ఇంటికి తిరిగి రాలేదు. చుట్టు పక్కల వెతికినా...ప్రగతి కనిపించలేదు. దీంతో అబిడ్స్ పోలీసులకు పిర్యాదు చేసింది ప్రగతి మేనత్త ప్రియాంక. సీసీటీవీ ఫుటేజ్ లో ఆగంతకుడు పాపను ఆటోలో ఎక్కించుకుని..వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కేసు నమోదు చేసి, దర్యప్తు చేస్తున్నారు పోలీసులు.