
మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా మాయమాటలు చెప్పీ.. డబ్బులు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి కిడ్డీ అమ్మించారు కొందరు వ్యక్తులు. ఆ తర్వాత డబ్బులు చేతుల పడ్డాక ఆ అమాయకుడి ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించాక ఈ ఘటన బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా రాజోలు లో చిట్టిబాబు అనే వ్యక్తి ని ఒప్పించి కిడ్నీ అమ్మించారు కొందరు వ్యక్తులు. కిడ్నీ అమ్మిన తర్వాత సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో చిట్టి బాబు వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు కుటుంబ సభ్యులు. పరిస్థితి విషమించి.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
కిడ్నీ అమ్మిన విషయం తమకు తెలియదని, కిడ్నీ అమ్మిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కురవి పోలీస్ స్టేషన్ లో కూతురు అల్లుడు ఫిర్యాదు చేశారు. వీళంతా ఒక ముఠాగా ఏర్పడి జిల్లాలో మరికొందరి కిడ్నీలు కూడా అమ్మేశాంటూ ఆరోపణలు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.