
అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్‌లోని కిడ్నీ బాధితుడు దమ్మపేట గ్రామానికి చెందిన సుమన్ పుట్టినరోజు వేడుకను సిబ్బంది నిర్వహించారు. ఏడాది కాలం నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని ప్రపంచ కిడ్నీ డే పురస్కరించుకొని తన పుట్టినరోజు ను సిబ్బంది చేయడం పట్ల సుమన్ సంతోషం వ్యక్తం చేశాడు.
కార్యక్రమంలో డాక్టర్లు నికేశ్ కుమార్, డాక్టర్ హర్షియా డయాలసిస్ సెంటర్ మేనేజర్ సలోమి రాణి సిబ్బంది పాల్గొన్నారు.